వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్న పులిమామిడి రాజు
సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామం నందు స్వయంభుగా వెలసిన శ్రీ గోదా సమేత అద్భుత వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమ సతీమణి పులిమామిడి మమత, కుమారుడు మనోజ్ లతో కలిసి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించు కోవడం జరిగింది. తదుపరి ఆలయకమిటీ వారు పులిమామిడి రాజును దుశ్యాలువాతో సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ క్షత్రజ్ఞులు, అధ్యక్షులు చిల్వేరి వెంకటేశం, సభ్యులు సుధాకర్ గుప్తా, శ్రీనివాస్, రుమాండ్ల రాజు, జగదీశ్వర్ పంతులు, షోలాపురం రాజు, యాదయ్య ముదిరాజ్, వీరేందర్ మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.