గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి.
అన్ని వార్డులలో విస్తృతంగా శానిటేషన్ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి.
నూతన డంపింగ్ యార్డ్ తక్షణమే ప్రారంభం చేయాలి
బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ
భద్రాచలం.భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు. మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపుమేరకు గ్రామపంచాయతీ లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని వార్డులలో శానిటేషన్ మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని పట్టణంలోని ప్రజా సమస్యలపై వివిధ డిమాండ్ల నువ్వు పరిష్కారం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామపంచాయతీ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు కి వినతిపత్రం సమర్పించారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామాలు గ్రామపంచాయతీలు అద్భుతంగా ఉన్నాయని నేటి పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని గ్రామపంచాయతీ నిధులు విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమైనని ఆరోపించారు.భద్రాచలం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేసి పంచాయతీలో ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.ఈ వినతిపత్రం అందజేసిన వారిలో బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్.బత్తుల నర్సింహులు.కాపుల సూరిబాబు.దానియేలు ప్రదీప్. ఐనాల రామకృష్ణ. కావూరి సీతామహాలక్ష్మీ.అంబటి కర్ర కృష్ణ. చిట్టిమల్ల అనిల్.యువరాజు. శివప్రసాద్.బడిశా నాగరాజు.మాచర్ల రంజిత్. గోసుల శ్రీనివాస్.నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.