సావిత్రిబాయి పూలే 194జయంతి ఉత్సవాలను జయప్రదంచేయండి:టి పి టి ఎల్ ఎఫ్ జిల్లా కన్వీనర్ జే నరసింహారావు

సావిత్రిబాయి పూలే 194జయంతి ఉత్సవాలను జయప్రదంచేయండి:టి పి టి ఎల్ ఎఫ్ జిల్లా కన్వీనర్ జే నరసింహారావు

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్& లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి 2 -2025 న సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల గౌరవ సన్మాన సభ పోస్టర్ ను జిల్లా కన్వీనర్ నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక సూర్యాపేట పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలల్లో కరపత్రాలు ప్రచారం విడుదల చేయడం జరిగింది కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జె.నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కొరకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి, ప్రైవేటు పాఠశాల కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇచ్చి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలలో ప్రైవేటు టీచర్లకు రిజర్వేషన్స్ కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ప్రైవేట్ పాఠశాల నుండి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి గౌరవ సన్మానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సన్మాన సభ జనవరి రెండవ తేదీ 2025న యుటిఎఫ్ జిల్లా కార్యాలయం సూర్యాపేట యందు మధ్యాహ్నం మూడు గంటల నుండి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ..శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్ వీరన్న రజిత నాగమణి శైలజ రెడ్డి శైలజ శోభన్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version