దళితుల స్మశాన వాటికను ఆక్రమణదారుల నుండి కాపాడండి.

దళితుల స్మశాన వాటికను ఆక్రమణదారుల నుండి కాపాడండి.

పాత అల్వాల్ రైలు కట్ట పక్కన ఉన్న దళితుల స్మశాన వాటిక ఆక్రమణలకు గురి అవుతున్న చోద్యం చూస్తున్న అధికారులు. దళితుల స్మశాన వాటిక సర్వే నంబర్, 5 లో.. 5 ఎకరాల, 13 గుంటలు ఉండేది. అందులో నుండి కొంత భాగాన్ని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు ఇచ్చారు. అది పోగా మిగిలిన స్మశాన వాటిక చుట్టూ ఆక్రమణల దారులు చాలావరకు ఆక్రమించుకున్నారు. ఆక్రమణలకు పోగా… మిగిలి ఉన్న దాదాపు మూడు ఎకరాల స్థలంలో చెత్త చెదారం.. మురికి బట్టలు కోళ్ల వ్యర్థ పదార్థాలు వేయడంతో చెడు వాసన వల్ల అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. వీటివల్ల స్మశాన వాటిక చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రవ్యాప్తంగా స్మశాన వాటికలకు కొంత బడ్జెట్ కేటాయించింది. కానీ 10 సంవత్సరాలు అవుతున్న నేటి వరకు ఈ స్మశాన వాటికలో ఎలాంటి పనులు చేపట్లేదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే స్పందించి పాత అల్వాల్ దళిత బస్తీకి ఆనుకొని ఉన్న ఈ స్మశాన వాటికను, తహసిల్దార్, లేదా ఆర్డిఓ గార్లతో సర్వే చేయించి కబ్జాకు గురైన స్థలాలను గుర్తించి వారి నుండి స్వాధీనం చేసుకుని ఈ స్మశాన వాటికను కాపాడవలసిందిగా దళితులు కోరుతున్నారు. అందులో ఉన్న చెత్త చెదార్థాలను తీసివేసి స్మశాన వాటిక చుట్టూ రెండు పక్కల గేట్లు పెట్టించగలరని కోరుతున్నారు. లేనిచో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టి తమ స్మశానవాటికను తామే రక్షించుకుంటామని…. అణగారిన హక్కుల పోరాట కమిటీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, గద్దర్ అభిమానుల సంఘం, జజ్జనక కళామండలి సంఘాల వారు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment