బోనాల ఉత్సవాలు చేపట్టిన తవక్కల్ పాఠశాల యాజమాన్యం

రామకృష్ణాపూర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తవక్కల్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఆ కార్యక్రమంలొ పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకొని అమ్మ వారికి సమర్పించారు.ఆ సందర్భంగా తవక్కల్ విద్యాసంస్థల అధినేత ఎండి.అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..18వ శతాబ్దంలో హైదరాబాదులో ప్లేగు వ్యాది వచ్చి వేల మంది మరణించారని అప్పుడు అక్కడి సైనికులు ఉజ్జాయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం వల్ల ఆ మరణాలు తగ్గాయని తెలిపారు.దాంతో అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారిని పూజించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏట ఆషాడ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే తవక్కల్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించామని పేర్కొన్నారు. బోనాల ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియచేస్తున్నామని భారతదేశంలోని పండుగల విశిష్టత, గొప్పతనం గురించి విద్యార్థులకు బోధిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బాగా కురిసి రైతులు పంటలు పండించి సుఖ:సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని ఆయన వివరించారు. ఆ నేపథ్యంలోనే రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.కాగా పాఠశాలలోని విద్యార్థులు రకరకాల దేవత ప్రదర్శనలు పోతురాజు వేషంలో చేపట్టిన విన్యాసాలు అలరించాయి.ఆ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment