పేటలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
పెద్ద శంకరంపేట మండలంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బాయికాడి నర్సింలు చారి, రామన్న అన్నారం మురళి, కాజిపల్లి సంతోష్ కుమార్ జలంధర్ , స్వర్ణకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు