క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ సేవలపై అభిప్రాయ సేకరణ 

క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ సేవలపై అభిప్రాయ సేకరణ 

 

జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

 

జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ సేవలపైనా క్యూ‌ఆర్ కోడ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. –జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, ఐపీఎస్ 

  తెలంగాణ రాష్ట్ర గౌరవ డిజిపి డాక్టర్.జితేందర్, ఐపీఎస్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి నూతనంగా విడుదల చేసిన క్యూఆర్ కోడ్ పోస్టర్(సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్)ను వినియోగించుకొని జిల్లా ప్రజలు పోలీస్ సేవల పైన తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు. ఇట్టి క్యూ‌ఆర్ కోడ్ పోస్టర్ లను జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాల్లో, డి.ఎస్పి ఆఫీసులో,ఎస్‌పి ఆఫీసు లో మరియు సోషల్ మీడియా నందు అందుబాటులో ఉంటాయి. జిల్లా ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్యూ‌ఆర్ కోడ్ పైన స్కాన్ చేసి వచ్చిన లింక్ ను తెరచి తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎస్పీగారు తెలియజేయడం జరిగింది.

పి‌ఆర్‌ఓ,

  • డి‌పి‌ఓ,వికారాబాద్.

Join WhatsApp

Join Now

Leave a Comment