– క్షేత్రస్థాయి పర్యవేక్షణతో వేగంగా పోలీసు సేవలను అందించవచ్చు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి కార్యాలయాన్ని సందర్శించారు. ఎస్పి కి డిఎస్పి రవి, డివిజన్ సీఐలు స్వాగతం తెలిపినారు. ముందుగా డి.ఎస్.పికార్యాలయ అవరనంలో మొక్కలు నాటారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పోలీసు సేవలు అందించాలని సూచించారు. అనంతరం కార్యాలయం రికార్డ్స్, పరిసరాలు పరిశీలించి తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ గురించి సమీక్షించారు, రౌడి షిటర్స్, సస్పెక్ట్ పై నిఘా ఉంచాలి ఆదేశించారు. కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లను, సర్కిల్ ఆఫీసుల పనితీరు పరిశీలించాలని డి.ఎస్.పి కి తెలిపినారు.
ఎస్పి వెంట డీఎస్పీ రవి, మునగాల సీఐ లు రాజేషేఖర్, వీర రాఘవులు, శ్రీను, రఘువీర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, డి సి ఆర్ బి ఎస్ ఐ యాకూబ్, ఎస్పి సీసీ సందీప్, డి సి ఆర్ బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.