విశ్రాంతి భవనం కోసం వినతిపత్రం అందజేత
రామగిరి మండలం సింగరేణి సంస్థ ఆర్జి త్రీ పరిధిలోని ఓసిపి2 లో కార్మికుల కోసం విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని కార్మికులు అధికారులకు శనివారం వినతిపత్రం సమర్పించారు.
పనులు చేసి అలసిపోయిన వేళ విశ్రాంతిభవనంలో సేద తీర్చుకునేందుకు గాను తప్పకుండా విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని వారు గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, గని మేనేజర్ రామారావు, సంక్షేమ అధికారి మురళిలకు వినతిపత్రం సమర్పించారు. కార్మికుల వినతిపత్రాన్ని స్వీకరించి విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు.