*ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి*
*గుండాల ఎస్ఐ జి.సైదులు*
*చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండల ప్రతినిధి ఆగస్టు 31*
యదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని కేంద్ర వాతావరణ అధికారుల సూచన మేరకు గుండాల మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎస్ఐ జి.సైదులు ప్రజలను కోరారు. ఎస్ఐ సైదులు మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని సూచించారు. అకాల వర్షాలకు తగ్గట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాల వల్ల తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చిన్నపిల్లలు వృద్ధులు బయటకి వెళ్ళవద్దని తడి వల్ల రోడ్డు జారి అవకాశం ఉండడంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలని పురాతన ఇండ్లలో ఉన్న వారు వాటిని కాలి చేయడం ఉత్తమమని పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదు ముఖ్యంగా రైతులు బావి దగ్గర మోటర్ల దగ్గర తడిసిన సాటర్లు డబ్బాలను ముట్టుకోకుండా ఉండాలని విద్యుత్ తీగలు స్తంభాలకు దూరంగా ఉండాలని. విద్యుత్ సమస్యలు ఉంటే సంబంధిత విద్యుత్ అధికారికి సమాచారం ఇవ్వాలని స్వతహాగా రిపేర్ చేయకూడదని తెలిపారు మహిళలు తడి బట్టలు ఆరేసేటప్పుడు తీగల మీద ఆరవేయొద్దని కరెంటు స్తంభాలకు దగ్గరగా నడవవద్దని ప్రజలకు సూచించారు.