కుడ కుడ ప్రజలకు హెచ్.పీ గ్యాస్ సేవలు అందని ద్రాక్ష

కుడ కుడ ప్రజలకు హెచ్.పీ గ్యాస్ సేవలు అందని ద్రాక్ష

సూర్యాపేట జిల్లాలో పేరుపొందిన హెచ్.పీ గ్యాస్ గోపయ్య చారి ఎంటర్ప్రైజెస్ లో ఎక్కువ భాగం హెచ్.పీ గ్యాస్ వినియోగదారులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ గ్యాస్ సేవలు గతంలో సూర్యాపేట పట్టణం వరకే డోర్ డెలివరీ ఉండేవి, సూర్యాపేటలో మున్సిపాలిటీ 2019 లో కుడ కుడ గ్రామపంచాయతీ విలీనం అయిన తర్వాత కూడా అదే పద్ధతిని పాటిస్తూ వారంలో ఎప్పుడు బుక్ చేసిన శుక్రవారం రోజు మాత్రమే బిల్స్ చేస్తూన్నారు. దీంతో కుడ కుడ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీ కి ఇక్కడి ప్రజలు ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన, కంప్లీట్ చేసిన వ్యక్తికి మాత్రమే ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తూ రోజులు గడుపుకుంటూ వస్తున్నారు తప్ప నిత్య సేవలు అందుబాటులోకి రాట్లేవని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి కుడ కుడ గ్రామస్తులకు హెచ్పీ గ్యాస్ సేవలను మెరుగుపరచాలని కోరుతున్నారు. భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ సేవలు కుడ కుడ గ్రామంలో అద్భుతంగా డోర్ డెలివరీ చేస్తున్న కానీ, హెచ్.పీ గ్యాస్ మాత్రం డోర్ డెలివరీలో రోడ్డుమీదికి వస్తే తప్ప గ్యాస్ ఇవ్వమని హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment