క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈరోజు నారాయణాఖేడ్ మండల్ చప్తా కే గ్రామంలో చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్
ఈ సందర్బంగా కే శ్రీనివాస్ కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు
పీసీసీ సభ్యులు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అన్నారు అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు
ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కే శ్రీనివాస్ అన్నారు క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు
ఏసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమం లో నారాయణరెడ్డి, బక్షిరాం, కొండల్ రెడ్డి, పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, వైజనాథ్, అమృత్, సాయిబాబా, బాబురావు, జైవత్, దావీద్, మారుతీ, నర్సప్ప, సంజీవ్, శివరాజ్ తదితరులు కలరు