నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 30, ఆగస్ట్
పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ నుండి మెహిదీపట్నం వరకు 260M/P రెండు నూతన బస్సు సర్వీసులను ఈరోజు గౌ *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్* ప్రారంభించారు. పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ-మెహిదీపట్నం కు ఏర్పాటు చేసిన రెండు బస్సులో ప్రయాణించి తొలి టికెట్ తీసుకున్నారు. ఈ బస్సు పటేల్ గుడా బి హెచ్ ఎల్మెట్రో కాలనీ నుండి బయలుదేరి బీరంగూడ, లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, టోలిచౌకి మీదుగా మెహిదీపట్నం వెళ్తుందని నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.