పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం
చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 31 మండలం ప్రతినిధి శ్రీశైలం
మెదక్ జిల్లా కొల్చారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, గ్రామంలోని వీధులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి వీధి తిరిగి కలెక్టర్ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మసీదు సమీపంలో రోడ్డు పక్కనే చెత్త వేయడం పట్ల మందలించారు. ప్రధాన వీధిలో రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు కుండి లో నీరు నిల్వ ఉండడం, నీటిలో దోమల లార్వాలు ఉండడంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి అంజయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో రోజూ తిరుగుతావా లేదా అని ప్రశ్నించారు. కొల్చారం గ్రామంలో పారిశుధ్య సమస్య పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని గ్రామస్తులు కలెక్టర్ కి తెలిపారు.