వైకుంఠ ఏకాదశి సందర్భంగా
కుటుంబ సమేతంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.
ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు ఆలయాలను కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సతీ సమేతంగా సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా జెపి కాలనీలో గల రుక్మిణి,సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయాన్ని మెట్టు కుమార్ యాదవ్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పటాన్చెరువులోని చైతన్య నగర్ కాలనీలో గల రామాలయం ఆల్విన్ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగిందని కార్పోరేటర్ ఈ సందర్భంగా తెలియజేశారు.