సిర్గాపూర్ కేజీబీవీలో అధికారుల తానికి

కేంద్రమైన సిర్గాపూర్ కేజీబీవీలో బోధన సిబ్బంది ఫిర్యాదుకు స్పందించిన సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు శని వారం విచారణ జరిపినట్లు తెలిసింది. కేజీబీవీ ప్రత్యేకాధికారి లలిత తోటి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడానికి తోడు తనకున్న అధికారాలను ఉప యోగించుకుని సిబ్బందిని నిత్యం ఇబ్బందులు, వేధింపులకు గురిచేస్తుంది. ఈ విషయమై సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంగా రెడ్డి సర్వశిక్షా అభియాన్ కమ్యూనిటీ మొబిలైజేన్ అధికారి (సీఎంవో) వెంకటేశ్, జీసీడీవో సుప్రియ, అకడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంవో) అనురాధ శని వారం సిర్గాపూర్ కేజీబీవీని తనిఖీ చేసి సిబ్బందిని విడివిడిగా విచారించినట్లు తెలిసింది. ప్రత్యేకాధికారితో మీకేమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వారు సిబ్బందికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సిబ్బంది తమ దృష్టికి తీసుకువచ్చిన అంశా లను జిల్లా విద్యాధికారికి నివేదిక రూపంలో సమర్పించనున్నట్లు వారు బోధన సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా చాలా ఏళ్లుగా సిర్గాపూర్ కేజీ బీవీ ఎస్ వోగా విధులు నిర్వహిస్తున్న లలితను ఇక్కడి నుంచి బదిలీ చేయా లని స్థానికులు కూడా అధికారులకు విన్నవించారని తెలిసింది.ఈ విషయమై మండల విద్యాధికారి శంకర్ను వివరణ కోరగా సిర్గాపూర్ కేజీబీవీ బోధన సిబ్బంది ఫిర్యాదుపై జిల్లా అధికారులు విచారణకు వచ్చిన మాట వాస్తవమే నని,సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు పర్యటన ఉన్నందున తనకు పూర్తి వివ రాలు తెలియవని ఆయన సమాధానమిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment