*పత్రికా ప్రకటన*

జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర,సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు తేదీ 13/11/2024 బుధవారం రోజున జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది పటాన్ చెరు శివారు ప్రాంతం నేషనల్ హైవే 65 పై వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వద్ద అక్రమంగా ఎండు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద (5.570) కిలోల ఎండు గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. వీరిలో ఒకరు పురుషుడు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు. వారి పేర్లు
1. మడ్కమి లచ్చ తండ్రి ఎంక
2. ⁠ ఏర్మే సునం w/o ఎర్ర సునం
3. ⁠ రామే పూనిమ w / o దూల పునిం.

ఇట్టి దాడులలో
డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ టీం సీఐ దుబ్బాక శంకర్…. ఎస్సైలు హనుమంతు, అనుదీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అదేవిధంగా తేదీ 12వ తేది మంగళ వారం రాత్రి సంగారెడ్డి పటాన్చెరు మండలంలోని గణపురం గ్రామ శివారులో రాత్రి పది గంటలకు తౌఫిక్ అనే వ్యక్తి నుంచి (560) గ్రాముల ఎండు గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఒక బైక్ ను సీజ్ చేశారు. ఈ వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందినట్లు ఎక్సైజ్ CI దుబ్బాక శంకర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment