చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దడిపశాల గ్రామంలో భూమి, భుక్తి, వెట్టిచాకరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయిధ పోరాటం
నిజాం రాజులకు దేశముకులకు పటేల్ పట్టు వారి దోపిడి వ్యవస్థకు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతన్న జరిగిన పోరాటంలో సాకలి ఐలమ్మ ప్రాముఖ్య పాత్ర పోషించిందని విసునూరుదొర దేశముకు తన చుట్టూ ఉన్న గ్రామాలు దేవరుప్పుల కడవెండి మొండ్రాయి జనగామ గొల్లపల్లి గుండాల మండలం పెద్దపడిశాల మరిపడిగా తో పాటు 60 గ్రామాలు ఆయన ఆధీనంలో ఉంచుకొని పెత్తనం చెలాయిస్తూ ప్రజలందరినీ ఎట్టి సహకరి చేయించుకుంటూ సాకలి వాళ్లు బట్టలు ఉతకాలి మంగలి వాళ్లు క్షవరం చేయాలి యాదవులు గొర్ల మేకలు ఇవ్వాలి గౌన్లోలు కళ్ళు పంపించాలి బంటోళ్లు పండ్లు పలాలు ఇవ్వాలి రైతులు ఆయన భూమిని ఫ్రీగా దున్నాలి మహిళలు ఫ్రీగా నాటి వేయ్యాలి ఇలా ప్రజలందరితోని ఎట్టి సాగిరి చేయించుకుంటూ ఆయన ఆధీనంలో ఉంచుకునేవాడు చాకలి ఐలమ్మ తనకున్న భూమికి తోడు ఇంకా కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవించేది ఇసునూరు దొర రామచంద్రారెడ్డి అదన్నా సాకలిదానివి మహిళ బట్టలు ఉతుకొని బ్రతికే దానివి నువ్వు వ్యవసాయం చేస్తావా అని తన అనుచరులతోని ఐలమ్మ పంటను నాశనం చేశాడు అప్పటికే భూస్వాములకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఏర్పడి ప్రజల్ని అంతా ఒకటి చేసి నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి ఆ సమయంలో సాకలి అయిలమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులను కలిసి తన సమస్యను వివరించింది భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం నల్ల నరసింహులు కాసం కృష్ణమూర్తి ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులంతా సాకలి ఐలమ్మ పంటను కోసి తన ఇంటికి చేర్చారు దొర ఆగ్రోడై ఐలమ్మను కమ్యూనిస్టు పార్టీలో చేరిన వటు ఐలమ్మను చెట్టుకు కట్టి చంపబోయారు చాకలి ఐలమ్మ ఒరేయ్ దొర నన్ను చంపితే నాకు నలుగురు కుమారులు ఉన్నారు నాయొక్క ఎర్ర జెండా ఉంది మా ఆశయాలను చంపలేవు నీ కొడుకు ఒక్కడే కమ్యూనిస్టులు వెంటపడి చంపితే నీ గడీలో గడ్డి మొలుస్తది రా అని దొరతోని సవాల్ చేసింది ఇలా ఎందరో మహనీయులు సాయిధ పోరాటంలో 5000 మంది అమరులై 10 లక్షల భూమిని పేదలకు పంచిందని అన్నారు చాకలి ఐలమ్మ భూమి కోసం భూమి బుక్తి కోసం ఉపాధి కోసం విద్య కోసం కార్మికుల సమస్యల కోసం పోరాడిందో ఆ ఆశయాలు నెరవేరాలంటే రైతాంగం మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు కార్మికులు కలిసి పోరాడి మన హక్కులు సాధించుకున్నప్పుడే ఐలమ్మకు అసలైన నివాళ్ళని అన్నారు ఈ కార్యక్రమంలో పోతరబోయిన సత్యనారాయణ మాజీ ఉపసర్పంచ్ పోతారబోయిన అంజయ్య బందెల పరశురాములు ఎండీ. ఖలీల్ యం.బాలయ్య నత్తి సోమయ్య జంపాల యాదగిరి శాకాపురం కుమార్ శాకాపురం శేఖర్ అల్ల మల్లేష్ బందెల వెంకటయ్య బందెల బుచ్చమ్మ జంపాల మధు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.