ఉప్పరపల్లి గ్రామంలో సమాచార హక్కు చట్టం(2005)పై అవగాహన కార్యక్రమం

నిర్వహించిన సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్

 

చెన్నారావుపేట మండలం,ఉప్పరపల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం మండల కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం(2005)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సమాచార హక్కు రక్షణ చట్టం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్ మాట్లాడుతూ:గ్రామంలోని ప్రజలు మరిముఖ్యంగా యువత సమాచార హక్కు చట్టం(2005)పై అవగాహన కలిగి ఉండాలని, గ్రామస్థాయి నుండే ఆర్టిఐలు వేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగే కార్య నిర్వహణ పనులను పరిశీలించాలని, తెల్ల కాగితంపై సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్6(1) కింది సమాచారం, సెక్షన్ 2(జె)(ii) ప్రతి పేజీనీ ద్రువికరించి సమాచారం ఇవ్వగలరు అని రాసిన ఆ అధికారి మీకు సమాచారం ఇవ్వాలని, దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సంబంధిత అధికారి మీకు సమాధానం అందించాలని లేదంటే చట్టపరంగా చర్యలు చేపట్టొచ్చని, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సమాచారం పొందే హక్కు ఉందని, ఆర్టిఐ వేసే విధానం సంబంధిత సెక్షన్ల యువకులకు తెలిపారు.గ్రామ ఉపాధ్యాయులు పులి దేవేందర్ మాట్లాడుతూ:ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, కేవలం పుస్తకాల్లో చదవడం కాదు సమాజంలో జరుగుతున్న విషయాలపట్ల స్పందించాలని, కావాల్సిన సమాచారాన్ని నిర్భయంగా సమాచార హక్కు చట్టం ద్వారా పొందచ్చని, ప్రశ్నించి ముందుకు వెళ్ళినప్పుడే మన సమాజంలో ఉన్న అవినీతిని తగ్గించగలమని పేర్కొన్నారు.సమాచార హక్కు రక్షణ చట్ట చెన్నారావుపేట మండలu అధ్యక్షులు కళ్లెపు గణేష్ మాట్లాడుతూ: ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉంటే ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మీకు కావాల్సిన సమాచారం నిర్భయంగా పొందచ్చని తెలిపారు.కలామ్స్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు పరికి మధుకర్ మాట్లాడుతూ:గ్రామంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని, గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన నిధులు, ఖర్చులు అన్నిటిపై సమాచారం పొందచ్చని, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం మా గ్రామంలో నిర్వహించిన సమాచార హక్కు రక్షణ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టిఐ రిపోర్టర్ కళ్లెపు ప్రణీత్, ఉప్పరపల్లి కలామ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎండి బాష్మియా, మాజీ సర్పంచ్ అందే పార్వతి వెంకటేశ్వర్లు, వట్టే తిరుపతిరెడ్డి, కలామ్స్ అడ్వైజర్ ఉడుగుల రాజు, పప్పు శ్రీ పాల్, ఉడుగుల వెంకటేశ్వర్లు, పెరుమాళ్ళ సాంబరెడ్డి, గుల్లపల్లి స్వామి, మాడుగుల కుమారస్వామి, నవీన్ల సాంబయ్య, రాజేష్, రాజ్ కుమార్, మణిశర్మ, బాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment