అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.(ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్)

అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.(ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్)

మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

వాతావరణ శాఖ మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమతంగా ఉండాలని, వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలిపిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్.జిల్లా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వాగులు వంకలు పరిస్థితిని పర్యవేక్షణలో ఉన్నారు.ఎటువంటి వదంతులు నమ్మవద్దు అని అన్నారు.వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దు.వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మరే అవకాశం ఉంది.వాహనాల టైర్లు జారి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది.కావున వాహనదారులు నెమ్మదిగా తమ వాహనాలతో ప్రయాణించాలి.జిల్లా అధికార యంత్రాంగం సూచించిన సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలి.ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సహాయ సహకారాలు వినియోగించుకోవాలి.జిల్లా పోలీస్ శాఖ 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలును ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment