విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేది ఉపాధ్యాయులే
అక్షర స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ అక్షర హైస్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి,ఉపాధ్యాయ వృత్తి గురించి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తమ బాధ్యతలు నిర్వర్తించడం నేర్చుకున్నారు. ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్ధం అని, నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మంచి విద్యావంతులను తయారు చేయగలరని విద్యార్థి ప్రిన్సిపల్ రష్మిత అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను కూడా పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నరేష్ రెడ్డి,రాజారెడ్డి కోశాధికారి రాము,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.