అభివృద్ధికి నోచుకోని పెద్ద పడిశాల ఎస్సీ కాలనీ
పైన పటారం… లోన లొటారం… నిర్లక్ష్యానికి పరాకాష్ట ఎస్సీ కాలనీ పై మోరి
కాలనీ వాసులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోని అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పెద్ద పడిశాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మోరిపై రోడ్డు మధ్యలో రంధ్రం కనిపిస్తుంది. ఆరు ఏడు నెలలు గడుస్తున్న అధికారులు ఎంపీడీవో స్పెషల్ ఆఫీసర్ ఎవరు పట్టించుకున్న పాపాన లేదు. అటు వెళ్లే వాహన చోదకులు పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. పగటి వేళల్లో రోడ్డు మధ్యలో రంధ్రం కనిపిస్తుంది. అదే రాత్రయితే ఆ గుంతలో పడటం కాయం అనిపిస్తోంది. కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాధుడు కరువాయే గ్రామ కార్యదర్శి మాట్లాడం ఏ ఈ వాటి కొలతలు తీసుకొని కొత్తది వేయాలని అంటున్నాడు తప్ప ఇప్పటివరకు ఆ పనులే మొదలు పెట్టలేదు ఎవరి తప్పు అధికారుల తప్ప కాలనీ వాసన తప్ప దీనికి అనుకొని మరొక్క సమస్య పక్కనే ఉన్న మరో గుంత ఏర్పడిన అధికారులు స్పందించడం లేదు. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.