కాంగ్రెస్ పార్టీ పరువు బజారుకి ఈడుస్తే ఎంతటి వారైనా సహించేది లేదు

కాంగ్రెస్ పార్టీ పరువు బజారుకి ఈడుస్తే ఎంతటి వారైనా సహించేది లేదు.

 

-ఎమ్మెల్యే కోరం కనకయ్య 

 

మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసే వారు ఉన్నారని, వారి మధ్య చిన్న చిన్న అగాధాలను పార్టీకి అంటగట్టవద్దని నాయకులకు కార్యకర్తలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య బయ్యారం వార్త ప్రతినిధితో ఫోన్ లో ప్రత్యేకంగా శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలాజీ పేట గ్రామంలో డ్వాక్రాకు సంబంధించిన అక్రమాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, తప్పు ఎవరు చేసినా ప్రజలు క్షమించరని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, సేవ చేసే పార్టీ అని, కార్యకర్తలు నాయకులు వర్గ, వైశ్యామ్యాలతో వైరుధ్యాలతో గ్రూపులుగా ఏర్పడి పార్టీలో అగాధాలను సృష్టించవద్దని హితవు పలికారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఒకే వర్గం అని, అది ప్రజల వర్గం అని, ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి ప్రెస్ మీట్ లు పెట్టి పత్రికలలో ఎవరు ఎక్కవ వద్దని హెచ్చరించారు. రాబోయే స్థానిక, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరు కలిసి కట్టుగా ,పని చేసి,పార్టీ గెలుపు కు సహకరించి, ప్రజల మన్ననలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి,ప్రజల మన్నలను పొందిన వారికే పదవులు వర్తిస్తాయని అన్నారు.ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ రాబోయే రోజుల్లో క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కల్గిన కార్యకర్తలు గా పేరు పొందాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment