నా ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తా..ఏంఎల్ఏ అరెకపూడి గాంధీ

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 13*

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటూ చూసినా పోలీసులను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటల‌‌ మంటలు‌ హద్దులు దాటి దాడుల వరకు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద గురువారం సాయంత్రం నుంచే పోలీసుల పహారా పెంచారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం గాంధీ ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ ఎస్ నేతలు ప్రకటించడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న పలువురు బీఆర్ ఎస్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. నానక్ రాంగూడలోని మాజీ మంత్రి హరీష్ రావ్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్ఎల్ఏ ల ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బీఆర్ ఎస్ నాయకులు తన ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి మధ్యాహ్నం చక్కటి విందు భోజనం తినిపించి పంపుతానని అన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ. ఎవరు వచ్చినా స్వాగతిస్తామని అందుకోసం తన ఇంటి ఆవరణలో కుర్చీలు కూడా ఏర్పాటు చేశానని ఎమ్మెల్యే గాంధీ.అన్నారు
అదేవిధంగా ఈరోజు.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10.00 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే లు గాంధీ ఇంటికి వస్తామని ప్రకటించటంతో కాంగ్రెస్ నాయకులు బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ నేతలు గాంధీ ఇంటికి వచ్చి గురువారం నాటి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment