నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..

నిర్మల్ పోలీస్.. మీ పోలీస్..

గణేష్ బందోబస్తులో పాల్గొన్న నిర్మల్ జిల్లా పోలీసు సిబ్బందికి ప్రశంస పత్రాలు : జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల 

నిర్మల్ జిల్లా భైంసా, ముదోల్, నిర్మల్ పట్టణం, ఖానాపూర్ ప్రాంతాలలో మంచిగా పని చేసిన 128 మంది సిబ్బంది కి ప్రశంసా పత్రాలను ఈ రోజు ఎస్పి డా.జి జానకి షర్మిల చేతులమీదుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవ్వటం జరిగింది. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారు ఈ నిమజ్జనం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేయటాని చూసి ఆనందం వ్యక్తం చేశారని. అన్ని వర్గాల వారు కాల్ చేసి ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. గతం లో భైంసా జరిగిన సంఘటనలు చూసి అందరూ భయపడ్డారు అని దానికి విరుద్ధంగా ఈ సారి బందోబస్తు జరగటం హర్షించదగ్గ విషయం అని చెప్పారు. డీఎస్పీ గంగా రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ లో గతంలో కంటే తొందరగా పూర్తి కావటానికి ముఖ్య కారణం బ్లూ కొల్ట్, పెట్రోల్ కార్ , స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యొక్క కృషి అభినందనీయం.ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకు మాత్రమే కానీ నేరస్తులకు కాదు అని అన్నారు. కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేయాలని చూశారు మరియు కొంత మంది పోలీసులని దుస్పాషలాడి చేయి చేసుకున్నారు కాబట్టి వారి మీద కేసులు పెట్టటం జరిగింది. ఎస్పి మాట్లాడుతూగణేష్ నిమజ్జనంలో జిల్లా పోలీసుల పాత్ర అద్భుతం. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భైంసా , ముదోల్, ఖానాపూర్, నిర్మల్ పట్టణం లొ గణపతి శోభాయాత్ర నీ పూర్తి చేయటానికి మీరు కంటి మీద కునుకు లేకుండా పని చేయటం మాత్రమే అని అన్నారు. వినాయకుణ్ణి ప్రతిష్ఠాపన నుండి నిమజ్జనం వరకు బ్లూ కొల్ట్, పెట్రోల్ కార్, ఐటీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది యొక్క కృషి అభినందనీయం. రాష్ట్రం మొత్తం భైంసా లో ఎలాగా నిమజ్జనం జరుగుతుంది అని సీనియర్ అధికార్లు ఆసక్తి గా చూశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శోభ యాత్ర జరగటం చూసి వారు అభినందించడం జరిగింది. ఒక నెల ముందునుండి ముందస్తు సమాచారం సేకరిస్తూ పకడ్బందీ బందోబస్తు జరగటం లో జిల్లా పోలీస్ అధికారుల కృషి మరులేనిదన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్పి తో పాటు అవినాష్ కుమార్ డిఎస్పీ గంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ లు, అర్ ఐ లు, అర్.ఎస్ఐ లు, బ్లూ కొల్ట్, పెట్రోల్ కార్, ఐటీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version