*రెండు నెలల క్రితం లక్ష రూపాయల సహాయం చేసి మానవత్వం చాటుకున్న నీలం మధు ముదిరాజ్..
నేడు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన పవన్ కుమార్.
ఆనందం వ్యక్తం చేసిన నీలం మధు.
ఇస్మాపూర్, ఆగస్టు6, (చార్మినార్ ఎక్స్ ప్రెస్):
పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం రాధమ్మ కాలనీకి చెందిన ఆంధ్రప్రదేశ్ అహోబిలం వాస్తవ్యులు పవన్ కుమార్ గారి లివర్ ట్రాన్సప్లాంటేషన్ కోసం నీలం మధు లక్ష రూపాయల సహాయాన్ని అందించారు, అయితే పవన్ కుమార్ లివర్ ట్రాన్సప్లాంటేషన్ అనంతరం ఈ రోజు తన కుటుంబంతో కలిసి వచ్చి తన శస్త్ర చికిత్స బాగా జరిగినట్టు తాను ఆరోగ్యగంగా ఉన్నట్టు, ఈ సహాయాన్ని అందించిన నీలం మధు కు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ఆయనను ఘనంగా సత్కరించారు. తనలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆదుకున్న మహానుభావుడు నీలం మధు ముదిరాజ్ అని ఆయన తెలిపారు,మరింత మందికి సహాయం అందించే ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు, ప్రజలను ఆదుకునే మనసు అందరికీ ఉండదని నీలం మధు లాంటి కొంతమందికె సాధ్యమవుతుందని అని తెలిపారు, తాను చేసిన సహాయం తో మీరు ఆరోగ్యంగా ఉండడం నాకు ఎంతో ఆనందాని కలిగించిందని నీలం మధు తెలిపారు.