కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని గతంలో వైఎస్సార్ హయాంలో వ్యవసాయ రంగంలో పనిముట్లకు ,యంత్రాలకు సబ్సిడీ అందించినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూడ అందిపజేసేందుకు కృషి చేయాలని వారు కోరారు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి ధన్యవాదాలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ గత పదేళ్లుగా వ్యవసాయ రంగంలో సబ్సిడీలను ఆపివేసిందన్నారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పనిముట్లకు, యంత్రాలకు సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అందిచేవిధంగా కృషి చేయాలని విన్నవించారు
ప్రభుత్వ సలహాదారు ను కలిసిన నాగరాజ్ గౌడ్
Published On: August 3, 2024 8:31 pm