సౌకర్యాల కల్పనలో దూసుకు వెళ్తున్న ముక్ట పూర్ పాఠశాల  

సౌకర్యాల కల్పనలో దూసుకు వెళ్తున్న ముక్ట పూర్ పాఠశాల  

 

 నారాయణఖేడ్ నియోజకవర్గం లోని నాగల్ గిద్ద మండలం ముక్టపూర్ గ్రామంలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్నాయి అనడానికి ముక్టపూర్ పాఠశాల నిదర్శనం ప్రభుత్వ పాఠశాలల్లో సమాజంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ల శక్తిని ధారపోసి ప్రభుత్వ పాఠశాలలు దేవాలయం తో సమానమని ఆ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లల విద్యాభివృద్ధికై పాటుపడుతూ ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేలా ఆ పాఠశాల అధ్యాపక బృందం పాఠశాలలో ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ఈ సౌకర్యాల కల్పనలో దాతలను సైతం ఈ పాఠశాల అభివృద్ధిలో మమేకం చేస్తూ విధులలో చేరిన ఆరు నెలల లోపే పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల అది మారుమూల ప్రాంతమైన నాగల్ గిద్ద మండలంలోని ముక్టపూర్ ప్రాథమిక పాఠశాల అది ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి మార్పు తేవాలి అనే నినాదంతో ఆరు మాసాలలో 20వేల రూపాయలతో పాఠశాలకు సీసీ కెమెరాలను సమకూర్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఫర్నిచర్ రకరకాల వాటికి మంచి రక్షణగా నిలిచింది అలాగే దాదాపు 18 వేల రూపాయలతో విద్యార్థులకు ఆకట్టుకునేలా ఆహ్లాదకరంగా గోడలపై రంగురంగుల చిత్రాలతో విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల వర్ణమాల ఎక్కాల ఏ బి సి డి ల చార్టులను బొమ్మలు వేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు పరిగెత్తుకొని వచ్చేలా చేశారు పేద విద్యార్థులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది కానీ విద్యార్థులకు సురక్షితమైన తాగడానికి నీళ్లు లేవని ఉపాధ్యాయ బృందం ప్రతిరోజు రెండు మూడు మినరల్ వాటర్ బాటిళ్లు తెచ్చి విద్యార్థులకు మంచినీళ్లు తాగిస్తున్నారు ఇలాంటి సత్కార్యాలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బాబు శెట్టి ఉపాధ్యాయులు లింగమేశ్వర్ , సంగమేశ్వర్, మండల పిఆర్టియు అధ్యక్షులు శేరికర్ రమేష్ కు ముక్టపూర్ గ్రామ ప్రజలు గ్రామ యువకులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment