శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సూర్యాపేట పట్టణ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.