టీడబ్ల్యూజేఎఫ్ నారాయణపేట జిల్లా నూతన అధ్యక్షునిగా లొట్టి శ్రీను ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నారాయణపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన ఫెడరేషన్ జిల్లా ద్వితీయ మహాసభలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లొట్టిశ్రీను, ఉపాధ్యక్షులుగా నర్సింహులు, కార్యదర్శిగా టి. మాధవ్, సహాయ కార్యదర్శిగా ఖాజా అబ్దుల్ ఖలిక్, కోశాధికారిగా ఎస్. లింగం, కార్యవర్గ సభ్యులుగా సురేష్ సర్జన్, బాల్ రాజు, శ్రీనివాస్, మోహన్ రాజ్, ఖమ్రొద్దీన్, దేవేంద్రప్ప, ఆంజనేయులు, దబాయ్ ఆంజనేయులు, ఆనంద్, ఇమామ్, హుస్సేన్ తదితరులు ఎన్నికయ్యారు. వీరితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డి. నారాయణ, ఏ. వెంకట్రాములు, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా గద్దెగూడెం యాదయ్య ఎన్నికయ్యారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) అనుబంధ తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్
(టీబీజేఏ) నారాయణపేట జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోఫీ, ఉపాధ్యక్షుడిగా జమ్మితల్ అలీ, కార్యదర్శిగా మద్దిలేటి, సహాయ కార్యదర్శిగా శివప్రసాద్, కోశాధికారిగా సలాం, కార్యవర్గ సభ్యులుగా మహబూబ్, నాగేంద్ర, ప్రవీణ్, సయ్యద్ అయూబ్ హుస్సేన్, రమేష్, శ్రీనివాస్ తదితరులను జిల్లా మహాసభలో ఎన్నుకున్నారు.