ఐదేండ్లలో అక్కున చేర్చుకున్నారు మీ రుణం మర్చిపోలేను ఎంపీటీసీ వేముల భారతి,

ఐదేండ్లలో అక్కున చేర్చుకున్నారు మీ రుణం మర్చిపోలేను

ఎంపీటీసీ వేముల భారతి,

అశ్వరావుపేట మండలం, పట్టణ ఎంపీటీసీగా ఈనెల 5వ తారీకు తో ఐదు సంవత్సరాలు పదవీ కాలాన్ని ప్రజలు ఇచ్చిన మన్నన్నలతో పూర్తి చేసుకున్నానని వేములభారతి సంతోషాన్ని వ్యక్తం చేశారు, ఓ గృహిణిగా ఇంటికి పరిమితమైన నన్ను ప్రజలు గుర్తించి ప్రజాసేవకు నన్ను పరిచయం చేసి మండల ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క వాటర్ కి ధన్యవాదాలు తెలియజేశారు, వేముల భారతి మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలు చేపట్టానని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందు వరుసలో ఉన్నానని అంతేకాకుండా కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు మా వంతు చేయూత అందించామని, దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారత కోసం జిల్లా వ్యాప్తంగా పాటుపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అమే తెలిపారు అంతేకాకుండా రానున్న రోజుల్లో ఏ హామీలను అయితే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేశాము ప్రజల పక్షాన పోరాడి ఆ హామీలను సైతం పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాలలో ముందుకు వెళతానని ఆమె తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment