సుజాత నగర్ మండలంలో ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత పర్యటన
కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు ఎంపీ సమక్షంలో 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యo ఇస్తామని అభయం సుజాతనగర్ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం సుజాతనగర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. సర్వారం, రాఘవపురం సింగభూపాలెం సుజాత నగర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు రాఘవపురం మాల బంజర గ్రామాల నుంచి బీఆర్ఎస్ ఇతర పార్టీల 50 కుటుంబాల వారు సింగభూపాలెం గ్రామం నుంచి 50 కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. వీరoదరికీ పార్టీ కండువాలు కప్పి.. ఎంపీ రఘరాం రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.అందరికీ అండగా ఉంటానని అభయం ఇచ్చారు.తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇటు సింగరేణి కేంద్రియ పరిశ్రమలు ఉన్నoదున ఎయిర్ పోర్టు నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఇప్పటికే తాను దృష్టి పెట్టి ఆ ఫైల్ లో కదలిక తెచ్చినట్లు తెలిపారు. రైల్వే కు సంబంధించిన కీలక అంశాలను కూడా సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తన నిధులను ప్రణాళిక ప్రకారం కేటాయిస్తా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా.. తాను తప్పక హాజరు అవుతానని తెలిపారు. నిరంతరం అందుబాటులో ఉంటానని, శ్రేణులు నేరుగా వచ్చి కలవొచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగా సీతారాములు, ఆళ్ల మురళి, విజయాబాయి కొప్పుల చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ నాయకులు బాదావత్ రాము చిమట నాగేశ్వరరావు బాగం మోహన్ రావు లొసెట్టి నాగార్జున్ సుజాతనగర్ ముస్లిం మైనార్టీ చైర్మన్ ఎస్.కె అజమత్ పాషా తదితరులు పాల్గొన్నారు