నారాయణఖేడ్ లో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

ఖేడ్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని

చార్మినార్ ఎక్స్ ప్రెస్ నారాయణఖేడ్ ప్రతినిధి సెప్టెంబర్ 20

నారాయణఖేడ్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆర్టిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రేపు సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్ వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బ్రోకర్లు విపరీతంగా పెరగడంతో నారాయణఖేడ్ ప్రజల దగ్గర విచ్చలవిధిగా డబ్బులు వసూలు చేస్తున్నారు కావున ప్రభుత్వం స్పందించి నారాయణఖేడ్ ప్రాంతంలో ఆర్టిఓ కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు దత్తు రెడ్డి పుప్పాల అశోక్ ఆనంద్ తిమ్మాపూర్ రాము తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment