సిర్గాపూర్ మండల తాసిల్దార్ ఉమా శంకర్ అలాగే స్థానిక ఏఎస్ఐ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సమాజంలో ఎక్కడ వెళ్లిన హోటల్లో రెస్టారెంట్లలో సమాజంలో చిన్న చూపు చూసిన కులంతో ద్వేషించిన కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ తరపున అన్ని విధాల సహకారం ఉంటుందని తక్షణమే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరిస్తామని కులంతో ద్వేషించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు అలాగే ఎమ్మార్వో ఉమా శంకర్ మాట్లాడుతూ పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని సిర్గాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ ఉమా శంకర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు.నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు.స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు
కూలహాంకరంతో ఎవరు హీనంగా చూసిన కఠిన చర్యలు తప్పవు ఎమ్మార్వో పోలీస్ సిబ్బంది
Published On: August 31, 2024 8:07 pm
![](https://charminarexpress.in/wp-content/uploads/2024/08/IMG-20240831-WA0192.jpg)