త్వరలోనే దిందా వంతెన నిర్మణపనులు ప్రారంభం
ఎమ్మెల్సీ దండే విఠల్
కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా
చింతలమానేపల్లిమండలంలోని
దిందా గ్రామ ప్రజల చిరకాల స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తీరుతుంది అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.సిర్పూర్ నియోజకవర్గంలోని
ఫారెస్ట్ అనుమతులు లేక నిలిచిన చింతలమనేపల్లి మండలం లోని దిందా వాగు పై వంతెన పనులు త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది అని ఎమ్మెల్సీ అన్నారు.నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు మంజూరు చెయ్యడం జరిగింది అని ఈ సందర్భంగా ఆయన మీడియాతో తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి గ్రామాలకు తాగునీరు విద్యుత్ విద్య వైద్యం రవాణా వసతి కల్పించాలని ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీపీ డుబ్బుల ననాయ్య, బసర్కార్ విశ్వనాథ్, టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్థన్,మాజీ సర్పంచ్ ఉమ్మేర లింగయ్య, నాయకులు ఉమా మహేష్,డగె సురేష్,ప్రసాద్, శంకర్,నారాయణ,దిందా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు