హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనుకయ్య.

హెల్త్ క్యాంపు ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం కనుకయ్య.

 

సమాజంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటేనే సమాజాభివృద్ధికి దోహద పడుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం గంధంపల్లి పంచాయతీ పరిధిలో వేణిగళ్ళ జగ్గయ్య ఫంక్షన్ హాలు లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో ఒక్కరోజు హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మల్టీ స్పెషాలిటీ డాక్టర్ లు బాలునాయక్ , హేమంత్, ఫయాజ్ ,ప్రతీప్ రెడ్డి, ఆద్వర్యంలో మెగా హెల్త్ క్యాంపులో వైద్యుల చేత ఎమ్మెల్యే, గ్రామ ప్రజలు తమ ఆరోగ్య పరీక్షలను పరీక్షించుకున్నారు.వ్యాధి బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారుఅనంతరం మండలంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులను బాధితులకు అందజేశారు.అదేవిధంగా గంధంపల్లి పంచాయతీ కి చెందిన ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బి.విజయ,సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, సీతారాం రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటపతి, నరసయ్య, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రయ్య, రాంబాబు, సురేష్, నాయకురాలు గుర్రం అన్నపూర్ణ , హెల్త్ క్యాంపు ల్యాబ్ టెక్నీషియన్ లు నవదీప్, సాయి, స్టాఫ్ నర్సులు కృష్ణవేణి, సంధ్య, నరేష్, అఖిల నరేష్, కరిష్మా, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment