పిఎసిఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ,

పిఎసిఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ,

ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్.

 నర్సింహులపేట మండల కేంద్రంలో “వ్యవసాయ సహకార పరపతి సంఘం ( పిఎసిఎస్)” నూతన కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్ మంగళవారం ప్రారంభించారు. చైర్మన్ సంపేట రాము గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్.సి.ఏ.బీ చైర్మన్, వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ తో కలిసి ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ . రైతులకు సేవలందించడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ధరలకే ఎరువులు, పనిముట్ల విక్రయం జరుగుతుందని తెలిపారు. కురవి, నర్సింహులపేట లో నూతన బ్యాంకులో ఏర్పాటు చేయాలని, టీఎస్.సి.ఏ.బీ చైర్మన్, వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ ను కోరారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ రైతులకు సేవలందిచడంలో నర్సింహులపేట పీఏసీఎస్‌ నిరంతరం పనిచేసే సొసైటీగా జిల్లాలోనే పేరు పొందిందన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలిచ్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ పి ఎస్ ఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, తోరూర్ మార్కెట్ వైస్ చైర్పర్సన్ బట్టు నాయక్, వైస్ చైర్మన్ బొబ్బ సంజీవరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి, ఉపేంద్ర సైదులు, బాలు నాయక్, యాకసాయిలు, వివిధ గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, నాయకులు బొబ్బ సోమిరెడ్డి, లింగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు కడుదుల రామకృష్ణ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు దస్రు నాయక్, కాంగ్రెస్ వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment