స్మశాన వాటిక లకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…….

పటాన్చెరు లోని బండ్లగూడలో హిందూ, ముస్లిం, క్రైస్తవ స్మశాన వాటిక లకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…….

 

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 31, ఆగస్టు

 

పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలోని పెన్నార్ ఇండస్ట్రీస్ వెనుకాల గల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరమ్మతు పనుల కొరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1 కోటి 30 లక్షల రూపాయల నిధులు మంజూరవడం జరిగింది, నిధులు మంజూరైన అనంతరం ఎన్నికలు రావడంతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. కాగా స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు బండ్లగూడలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ స్మశాన వాటిక లకు ప్రహరీ గోడ నిర్మాణ పనులు మరియు పనుల కొరకు మంజూరైన నిధులతో వెంటనే పనులు ప్రారంభించాలని కోరడం జరిగింది. 

కాగా ఈరోజు ఆగస్టు 31 శనివారం నాడు ఉదయం గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు కాలనీ వాసులతో కలిసి స్మశాన వాటికకు నూతన ప్రహరీ గోడ నిర్మాణం కొరకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment