పలు కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ.
కొత్తగూడెం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి మేదరబస్తీలో కౌన్సిలర్ పూర్ణ తండ్రి ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరం అల్లీపురం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శీతల రామసంగం తండ్రి ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని,సహకారనగర్ లో కిలారు రామకృష్ణ తండ్రి ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు.