యూనిక్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య సేవలను వినియోగించుకోవాలి

యూనిక్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య సేవలను వినియోగించుకోవాలి

 

మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలి

 

యూనిక్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

 

చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలోని విద్యా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిక్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధతో కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. హాస్పటల్ కు వచ్చే చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు.అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు కొలిశెట్టి సుమన్, సిలివేరు లింగరాజు మాట్లాడుతూ చిన్నారుల కోసం పెద్ద నగరాలకు ధీటుగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు యూనిక్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ప్రారంభించినట్లు తెలిపారు.తమ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.అనుభవం కలిగిన డాక్టర్ చే చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు.సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను వినియోగించుకుని ఆదరించాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కొమలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment