రాష్ట్ర ప్రజలందరి పై శ్రీ వారి ఆశీస్సులుండాలి….
నీలం మధు ముదిరాజ్…
శ్రీ రంగాపురం రంగనాయక స్వామి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న నీలం మధు..
శ్రీ రంగసముద్రం రిజర్వాయర్,ఆలయ ప్రాంగణంలోని మ్యూజియం సందర్శన..
ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా రంగ నాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు.
నీలం మధు మాట్లాడుతూ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లిన ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భాన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారన్నారు . వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి.. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు. ఆ దేవదేవుడు ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ రంగ నాయక ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు ఉన్న రంగసముద్రం కొలను చూడమచ్చటగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణలతో పాటు ఆలయాల అభివృద్ధికి సహకరించే విషయంలో తానెప్పుడూ ముందుంటానన్నారు. అనంతరం శ్రీ రంగ సముద్రం తో పాటు రిజర్వాయర్ ను, మ్యూజియం ను వారు సందర్శించారు. కార్యక్రమంలో డా,,పగిడాల శ్రీనివాస్, చొప్పరి వెంకటయ్య,నరేష్, పి వెంకటయ్య, ఎం రఘు,ఆంజనేయులు,మూర్తి,కృష్ణయ్య,బిసన్న,కృష్ణ, ఈశ్వరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు