*కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు*
చార్మినార్ ఎక్స్ ప్రెస్ నర్సాపూర్ సెప్టెంబర్ 20
వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన 30 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజి రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఫిషర్మెన్ తలారి మల్లేష్ గుత్తి కిషన్ గుత్తి చంద్రం గుత్తి సుదర్శన్ సట్టి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.