వైభవంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు

వైభవంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు.

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్: సెప్టెంబర్ 10.

పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట పట్టణంలోని తిరుమలాపూర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పీటలు ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో సామూహిక కుంకుమార్చనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల మహిళ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాగం అర్చన చకిలం విశాల. మాజీ వైస్ ఎంపీపీ కన్నయ్య గారి లక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version