మౌన లోకాలకు మన్మోహన్ సింగ్
భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: పబ్లిక్ క్లబ్ కార్యదర్శికొప్పుల వేణా రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రం( రెడ్ హౌస్ )లో పిసిసి సభ్యులు , పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణరెడ్డి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు.
గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు.
పేదవాడి అభ్యున్నతి కోసం రూపొందిన విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలతో పాటు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించి మన రాష్ట్ర కళను సాకారం చేసిన దార్శనికుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని గుర్తుచేశారు.