మాణిక్య ప్రభు మందిరం గణేష్ శోభాయాత్ర
సంగారెడ్డి జిల్లా:- జోగిపేట పట్టణంలో “శ్రీ మాణిక్య ప్రభు” మందిరంలో నెలకొల్పిన వినాయక నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అంగరంగ వైభవంగా పుర వీధుల గుండా అంగరంగ వైభవంగా శోభయాత్ర ప్రారంభమైంది. మహారాష్ట్ర నుండి వచ్చిన భజన మండలి భజన సంకీర్తనలు, నృత్యాలు,మహిళల కోలాటాల మధ్య ప్రభు మందిర్ నుండి మధ్యాహ్నం:- 1:00 నుండి శోభాయాత్ర ప్రారంభమై క్లాక్ టవర్, మీదుగా ముత్యాలమ్మ గుడి, గౌని చౌరస్తా, పోచమ్మ మందిర్,హనుమాన్ మందిర్ మీదుగా బస్టాండ్ బసవేశ్వర విగ్రహం, మెయిన్ రోడ్డు, హౌసింగ్ బోర్డ్, గుండా శోభాయాత్ర కొనసాగి అనంతరం ఆందోల్ చెరువులో సాయంత్రం:- (6) గంటలకు గణపతినిమజ్జనం ముగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేందర్ గౌడ్ 13వ వార్డ్ కౌన్సిలర్ రంగా సురేష్ కౌన్సిలర్ పట్టులోరా ప్రవీణ్, కౌన్సిలర్ నాగరాజు, రాజు ప్రభుమందిర్ భజన మండలి భక్తులతో పాటు పరువురు కాలనీ పెద్దమనుషులు, యువకులు, పిల్లలు మహిళా సోదరీమణులు, పాల్గొన్నారు.