గంజాయి సేవించే యువకులకు, వారి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన మందమర్రి సీఐ..శశిధర్ రెడ్డి

వివరాల్లోకి వెళితే. చాలా మంది యువకులు చిన్న వయస్సులోనే గంజాయి బారినపడి, మత్తుకు బానిసలై వారి విలువైన భవిష్యత్తును, ఆరోగ్యాన్ని చెజేతులారా నాశనం చేసుకుంటున్నారనీ, అ మత్తులో విచక్షణ జ్ఞానం కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారనీ అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణo లో గంజాయి సేవిస్తున్న సుమారు 10 మంది యువకులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి, వారందరికీ వారి తల్లితండ్రుల సమక్షంలో సీఐ.కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ గంజాయి సేవించడం వలన అనారోగ్యానికి గురి ఔతారని, అ మత్తులో నేరాలకు పాల్పడి జైలు పాలు ఔతారని, మీ కుటుంబాలకు దూరం అయ్యి, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయని, కుటుంబంలో ఒక్కరు గంజాయికి బానిసయినా కూడ కుటుంబం మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని, కావున పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువకులు గంజాయికి దూరంగా ఉండాలని తెలిపారు.ఎవరైనా గంజాయి అమ్మిన, గంజాయి కలిగి ఉన్నా, గంజాయి సేవించిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ తో పాటు రామకృష్ణాపూర్ యస్.ఐ. రాజశేఖర్, డబ్ల్యూ ఏ ఎస్ ఎస్ ఐ రజిత, హెడ్ కానీస్టేబుల్ జంగు, కానిస్టేబుల్ వెంకటేష్ మరియు యువకుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version