మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి క్రీడా పోటీలను స్థానిక ఎస్సై డి విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలికాంతరెడ్డి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్ , ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ, బాలాజీ నాయక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రీడాలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి నిర్వహించనున్న మండల స్థాయి క్రీడా పోటీలు బాలురులకు అండర్ 14 అండర్ 17 భాగంగా ఖో ఖో, కబడ్డీ, ఇతర పోటీలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు.సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలని అన్నారు. పోటీల్లో పాల్గనేందుకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గన్నారు.ఈ కార్యక్రమంలో పిటిఆర్టి మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, రమేష్, లక్ష్మణ్ నాయక్ ,సత్యనారాయణ , మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుజాత, కేజీబీవీ ఎస్ఓ వసంత, పిడి లు దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.