మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మల్లెబంతుల వెంకన్న
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో మత్స్య కార్మిక సంఘం జెండాను మల్లెబంతుల వెంకన్న, వస్తా కొండూరు గ్రామంలో యాట రాజు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు అనంతరం మల్లెబంతుల వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి సంఘ సభ్యులు అందరూ కూడా కుల సంఘ ఐక్యత కోసం పాటుపడాలని అన్నారు కుల సంఘం హక్కులపై ప్రతి ఒక్కరు తెలిసి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటారని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన సంఘ సభ్యుల ఐక్యత ఏర్పడుతుందని సంఘం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లను 18 సంవత్సరాల నుండి ప్రతి సభ్యునికి సభ్యత్వం కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు కాశబోయిన సోమయ్య మాజీ ఉపసర్పంచ్ పోతారబోయిన అంజయ్య మాజీ సోసైటీ కార్యదర్శి శివరామకృష్ణ ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మల్లెబోయిన సందీప్ సొసైటీ డైరెక్టర్ సింగారపు నాగరాజు దుంపల రాములు వెంకన్న ఆంజనేయులు ఎల్లయ్య చెరుకు శీను నర్సయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.