రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి, నారాయణాఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యులు,సామాజిక సేవకులు శాంరాయినోళ్ళ సంతోష్ రావు

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

 

నారాయణాఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యులు,సామాజిక సేవకులు శాంరాయినోళ్ళ సంతోష్ రావు

 

స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీన నారాయణాఖేడ్ పట్టణం లోని పల్లవి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు నారాయణాఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యులు,సామాజిక సేవకులు శాంరాయినోళ్ళ సంతోష్ రావు పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యాక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి విజయవంతం చేయాలనీ కోరారు. రక్తదానం చేసి మన తోటివారికి ప్రాణదాతలుగా నిలవాలని తెలిపారు.ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల వివేకానంద స్వామి భావజాలాన్ని సంకల్పంగా చేసుకొని యువకులు, రక్త దాతలు, విద్యావంతులు జనవరి 12న స్వామి వివేకానందను స్మరించుకుంటు నారాయణాఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేద్దాం అని ప్రజలను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment