కొప్పోలు ఉమా సంగమేశ్వర ఆలయంలో మహారుద్రాభిషేకం.
లక్ష పుష్పార్చన.
తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19, పెద్ద శంకరంపేట్.
పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొప్పల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో తొగుట పీఠాధిపతి మాదావనంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం ,లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమా సంగమేశ్వర స్వామికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాద వితరణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి.. గుర్రపు మచ్చేందర్. జంగం శ్రీనివాస్. ఆలయ కమిటీ అధ్యక్షుడు బాపి బాప్ సేటు కమిటీ సభ్యులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు.